Homeమరిన్నిపాట రాయించి, పాడించిన మాజీ ఎంపీ వివేక్ అభిమాని

పాట రాయించి, పాడించిన మాజీ ఎంపీ వివేక్ అభిమాని

song on vivek venkataswamy : పాట రాయించి, పాడించిన మాజీ ఎంపీ వివేక్ అభిమాని

మాజీ ఎంపీ బీజెపి జాతీయ కమిటీ మెంబర్ డా. జీ. వివేక్ వెంకటస్వామిపై త‌న విరాభిమాని పాట రూపంలో త‌న అభిమానాన్ని చూపించాడు.

పాలకుర్తి మండలం ఘన్ శ్యాందాస్ నగర్ గ్రామంలో పెద్దపెల్లి డా. జీ. వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు వివేక్ వెంకటస్వామి వీరాభిమాని ఈసారపు శివ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.

వేడుకలలో వివేక్ వెంకటస్వామి అభిమానులు సయ్యద్ సజ్జాద్, తొగరి తిరుపతి హాజరయ్యారు.

ఈసారపు శివ వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా రాయించి పాడించిన పాట సీడీని ఆవిష్కరించారు.

అనంత‌రం కేక్ కట్ చేసి స్థానిక‌ ప్రజలకు స్వీట్లు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో బాలసాని సతీష్, మాదాసు విజయ్, బుట్టి శ్రీధర్, శేఖర్, తిరుపతి, శ్రీనివాస్, సమ్మయ్య, రాజు, రమేష్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img