డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుండి పుష్ప పుష్ప అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఫుల్ లిరికల్ సాంగ్‌ను మే 1న ఉదయం 11:07కు విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.