Homeహైదరాబాద్latest Newsప్రజాపాలనకు అప్లై చేసుకున్న సోనియాగాంధీ..! కుమారుడిగా సీఎం రేవంత్.. ఫోటో వైరల్

ప్రజాపాలనకు అప్లై చేసుకున్న సోనియాగాంధీ..! కుమారుడిగా సీఎం రేవంత్.. ఫోటో వైరల్

ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ఇంకా చిత్రవిచిత్రాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మొన్న శివుడు, నిన్న ఇంటి దగ్గర దొరుకతలేదు, నేడు తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నట్లు సోనియా గాంధీ ఫోటోతో కూడిన ఓ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇందులో సోనియా గాంధీ కుమారుడిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురిగా కొండా సురేఖ, అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు నమోదు చేశారు. ఈ అప్లికేషన్ల పైన ఎలాంటి నంబర్ లేకపోవడంతో కావాలనే చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్ల వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img