తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకావడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు గా తెలుస్తుంది. అనారోగ్య కారణాలతో, ఎండల తీవ్రత కారణంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు సోనియా హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరొస్తారనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది.