దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలతో ఒప్పందం
ముంబయి: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరణించిన తన తల్లి, ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించబోతున్నట్లు ప్రకటించారు. scholarships@sonusood.me ద్వారా దరఖాస్తు చేసుకోమని కోరారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్నవారు ఎవరైన అప్లై చేసుకోవచ్చన్నారు. వసతి, ఆహారం, ఫీజు.. అన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా అర్హులైన పేదలకు స్కాలర్‌షిప్‌లు అందజేసేందుకు పలు యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. తన తల్లి పంజాబ్‌లో పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పేదని, వీలుంటే తనను కూడా విద్యార్థులకు సాయం చేయాలని చెప్పేదని తన తల్లి మాటలను గుర్తుచేసుకున్నాడు. టీచర్స్ డే సందర్భంగా తన తల్లి స్కెచ్‌ని షేర్ చేస్తూ ‘నువ్వు చూపిన దారిలోనే వెళ్తూనని.. గమ్యం దూరంగా ఉన్నా ఖచ్చితంగా చేరుకుంటానని’ పేర్కొన్న సంగతి తెలిసిందే.