ఏపీ రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ ఉద్విగ్న క్షణాల కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2014లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జనసేనాని 21కి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలుచుకున్నాడు.