– రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇదేనిజం, భువనగిరి : చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీనిచ్చారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి సోమవారం నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాలలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి జనవరి 2న టెండర్ పిలిచి సంక్రాంతికి శంకుస్థాపన చేస్తామన్నారు. చిట్యాల మునిసిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.