– ఇంటర్ విద్యార్థి సూసైడ్
ఇదే నిజం, హైదరాబాద్: కళాశాల యాజమాన్యం ఒత్తిడి భరించలేక ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మీర్ పేట్ పీఎస్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకున్నది. జిల్లెలగూడకు చెందిన ఓ విద్యార్థి చైతన్యపురిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా తన ఇంట్లో చీరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ సారీ అమ్మా.. నాన్నా.. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కళాశాలలో అధ్యాపకులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంకెవరూ ఈ కళాశాలలో జాయిన్ అవ్వొద్దు’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.