న్యూఢిల్లీ: ఇండియా నుంచి విమాన రాకపోకలపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. ఇండియాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సౌదీ పేర్కొంది.
కరోనా అధికంగా ఉన్న బ్రెజిల్, అర్జెంటీనా దేశాల విమాన రాకపోకలను కూడా నిషేధం విధించింది. ఈ నిషేధం సాధారణ ప్రయాణికులపై మాత్రమేనని, అధికారిక వ్యవహారాలపై వచ్చేవారికి ఈ నిషేధం వర్తించదని సౌదీ అరేబియా అధికారులు వెల్లడించారు.