Homeఅంతర్జాతీయం#Hindhi #Southkorea : హిందీ కోసం దక్షిణ కోరియా విద్యార్థులు పోరాటం

#Hindhi #Southkorea : హిందీ కోసం దక్షిణ కోరియా విద్యార్థులు పోరాటం

South Korean students start fighting for Hindi language. Busan University is seeking the University of Foreign Studies as a social media platform, with the removal of a course on the study of the Hindi language.

హిందీ భాష కోసం దక్షిణ కోరియా విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. హిందీ భాషా అధ్యయనానికి సంబంధించిన కోర్సును తొలగించద్దొంటూ బూసాన్ యూనివర్శిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ యూనివర్శిటీని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

హిందీ భాషా కోర్సులను తొలగించేందుకు యూనివర్శిటీ అధికారులు నిర్ణయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ విషయమై సియోల్‌లోని భారత్ ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశారు.

దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్శిటీ, హాన్‌కుక్ యూనివర్శిటీలు మాత్రమే హిందీ భాష అధ్యయనానికి అవకాశం కల్పిస్తున్నాయి.

బూసాన్ విశ్వవిద్యాలయంలో 1983లో హిందీ భాష కోసం ఇండియన్ స్టడీస్ విభాగం ఏర్పాటవగా.. 1972 నుంచే హాన్‌కుక్ యూనివర్శిటీలో హీందీ భాషపై ప్రత్యేక కోర్సులు ఉనికిలో ఉన్నాయి.

కాగా.. కొద్ది వారాల క్రితం ఇండియన్ స్టడీస్ విభాగం కీలక ప్రకటన చేసింది.

హీందీ భాషకు సంబంధించిన కోర్సులకు ముగింపు పలికే యోచనలో యూనివర్శిటీ ఉందనేది ఈ ప్రకటన సారాంశం.

భారత్‌లో పనిచేయాలనుకునే దక్షిణకొరియా వారికి ఇంగ్లీష్ వస్తే సరిపోతుందని కూడా పేర్కొంది. అయితే..ఈ ప్రకటనతో హిందీ భాషా కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది.

దీంతో వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తమ నిరసల తెలుపుతున్నారు.

ఈ విషయమై లీ జున్‌హాక్ అనే వ్యక్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హీందీ భాష అధ్యయనం ద్వారా భారత్‌లోని మారుమూల ప్రాంతాలను కూడా చేరుకుని అక్కడి సంస్కృతులను అధ్యయం చేయచ్చని తెలిపాడు.

మరోవైపు.. హీందీ భాషపై ఆసక్తిగల విద్యార్థులు సియోల్‌లోని భారత ఎంబసీకి, ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలకు కృషి చేసే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌కు ఈ విషయమై నేరుగా ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన ఆవేదన తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపించారు.

Recent

- Advertisment -spot_img