Homeజిల్లా వార్తలువెనక్కి పంపిన సొయా పంట .. ఆందోళనలో రైతన్న..!

వెనక్కి పంపిన సొయా పంట .. ఆందోళనలో రైతన్న..!

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా మద్నూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.సోమవారం సోయా పంట బాగులేదంటూ ఇక్కడి నుండి వెళ్ళిన లారీలను అక్కడ పరిశీలించిన అధికారులు బాగు లేదంటూ 500 నుండి 600 బ్యాగులు వెనక్కు పంపడంతో మద్నూర్ మార్కెట్ యార్డులో సోమవారం నాడు రైతులంతా ఆందోళనకు వ్యక్తం చేశారు.విండో కార్యదర్శిని ఎందుకు పంట వెనక్కి వచ్చిందని అడిగారు.నిబంధనల ప్ర కారమే తాము సోయాలు అమ్మామని కొనుగోళ్ల అనంతరం రైతులకు ఇలా వాపసు చేయడం సరియైన విధానం కాదంటూ విమర్శించారు.మద్నూర్ తాసిల్దార్ ముజిబ్ మరియు సొసైటీ కార్యదర్శి బాబురావు రైతులతో మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img