చెన్నై: గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాజాగా బులెటిన్ విడుదల చేశారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన గత కొన్ని రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. నెగిటివ్ వచ్చినా కూడా ఆయన ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని వైద్యనిపుణులు తెలియజేశారు.
ప్రస్తుతం బాలు ‘ఎక్మో’ లైఫ్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల ఎస్పీ బాలు కోరుకుంటున్నారని.. ఆహారం తీసుకుంటున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. దీంతో ఎస్పీ బాలు త్వరలోనే కోలుకొని మునుపటి మాదిరిగా పాటలు పాడుతారని ఆయన అభిమానులు ఆశించారు. కానీ అనూహ్యంగా ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయడం.. దాంట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పేర్కొనడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. త్వరలోనే ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
RELATED ARTICLES