Homeహైదరాబాద్latest Newsప్రత్యేక వైద్య శిబిరం

ప్రత్యేక వైద్య శిబిరం

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ మర్రిమిట్ట నందు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిభిరం ను, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి సందర్శించారు. హాస్టల్ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను తనికిచేసి, పిల్లలకు వేడి వేడి ఆహార పదార్థాలను వండి పెట్టవలెనని, అందరూ పిల్లలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఇట్టి శిబిరంలో మొత్తం 45 మంది పిల్లలను పరీక్ష చేసి, ముగ్గురు పిల్లలకు రక్త పూతలా నమునాలను పరీక్షించి మందులను ఇచ్చారు. సహస్ర 13 సం ల విద్యార్థిని కీ ఛాతీలో నొప్పిగా ఉంటే వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం గూడూరుకు రెఫర్ చేశారు. ఈ కార్య క్రమంలో, డాక్టర్ పుష్పాలత, ప్రిన్సిపాల్ రాధిక, హెల్త్ ఎడ్యూకేటర్ పురుషోత్తం, హెచ్ ఈ ఓ. లోక్యా నాయక్, పి హెచ్ ఎన్. కోమల, సూపర్వైజర్ గణేష్, హేమలత, సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img