ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాసం చివరి సోమవారం పొలాల అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు మెట్టు రామశర్మ నేతృత్వంలో ఉమామహేశ్వర లకు జలాభిషేకం అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక బింద చొప్పున నీరు తెచ్చి స్వామి వారికి జలాభిషేకం చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి భజన సంఘ సభ్యులు నెల రోజుల నుండి ఆలయంలో ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలకు భజన ప్రాక్టీస్ చేయించి చివరి రోజు వారందరి కూడా గుర్తింపుగా జ్ఞాపకాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మెట్టు రామశర్మ మాట్లాడుతూ.. గ్రామాల్లో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి దేవాలయాలు అర్చకులు గ్రామ పెద్దలు అందరూ ముందుకు రావాలి. ధర్మో రక్షతి రక్షితః చిన్నతనము నుండి బాల బాలికలకు భక్తి భావం నేర్పించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జినుక తిరుపతి మంజుల చక్రి కదిరే పరశురాములు గౌడ్ మహిళలు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.