Homeహైదరాబాద్latest Newsఉత్తర నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

ఉత్తర నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ శాంతి స్వరూపుడు రాజు గురుస్వామి కరకములచే స్వామివారికి గణపతి హోమం. పంచామృత అభిషేకం. పుష్పార్చన పూజ. వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదం పడిపూజ వంటి కార్యక్రమాలు చేపట్టినారు అనంతరం స్వామివారిని దర్శించుకొని అయ్యప్ప భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి మాట్లాడుతూ ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం.నుండి ప్రత్యేక పూజలు హోమం పంచామృత అభిషేకం రాత్రి పడిపూజ కార్యక్రమాలు చేపడుతూ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలోని అయ్యప్ప మాలధారణం భక్తులు సడిమెల ఎల్లం. తలారి నర్సింలు. తాళ్ల విజయ్. ఆలయ పూజారి శ్రీపాద శర్మ. భక్తులు కొల్లూరి శంకర్. తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img