Homeహైదరాబాద్latest Newsపీఎం కిసాన్ పథకంలో స్పెషల్ సర్వీసులు..పది రోజులే గడువు

పీఎం కిసాన్ పథకంలో స్పెషల్ సర్వీసులు..పది రోజులే గడువు

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా త్వరలోనే స్పెషల్ సర్వీసులను అందించనుంది. పీఎం కిసాన్ సాచురేషన్ డ్రైవ్ ద్వారా జూన్ 5 నుంచి 15 వరకు పలు సర్వీసులు అందుబాటులోకి తేనుంది. వాటిల్లో..

  1. పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
  2. పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
  3. భూమి వివరాలను పోర్టల్‌కు అనుసంధానించవచ్చు.
  4. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

మరింత సమాచారం కోసం దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ CSCని సంప్రదించగలరు. కాగా ఎన్నికల ఫలితాల తర్వాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img