Homeఆంధ్రప్రదేశ్ప్రజలు ఉద్యమిస్తేనే.. ప్రత్యేక హోదా

ప్రజలు ఉద్యమిస్తేనే.. ప్రత్యేక హోదా

– సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
– ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కార్యచరణ ప్రకటించిన జై భారత్​ నేషనల్​ పార్టీ

ఇదేనిజం, ఏపీబ్యూరో : ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై జై భారత్ నేషనల్ పార్టీ అధినేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కార్యాచరణను ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడే మొదలైందని, ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జిలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. జనవరి 26న ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఆంధ్రప్రదేశ్​ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే.. కాదు, పదేళ్లు కావాలని అప్పుడు బీజేపీ చెప్పిందన్నారు. టీడీపీ, వైసీపీ ఎన్నికల కోసమే హోదా అంశాన్ని లేవనెత్తుతున్నాయని జేడీ ఘాటుగా విమర్శించారు.

Recent

- Advertisment -spot_img