Homeహైదరాబాద్latest Newsగురక సమస్యలకు నిమ్స్‌లో ప్రత్యేక చికిత్స.. అసలు గురక ఎందుకు వస్తుందంటే..?

గురక సమస్యలకు నిమ్స్‌లో ప్రత్యేక చికిత్స.. అసలు గురక ఎందుకు వస్తుందంటే..?

గురక సమస్యలకు చికిత్స చేసేందుకు నిమ్స్‌ సిద్ధమవుతోంది. ఈ సమస్యతో బాధపడేవారికి ప్రత్యేక ల్యాబ్‌లో చికిత్స అందించనున్ముది. ముఖ్యంగా అధిక బరువు, ధూమపానం, మద్యపానం అలవాట్లు, శ్వాస నాళాల్లో అడ్డంకులు ఉంటే స్లీప్‌ అప్నియా(గురక)కు దారి తీస్తుంది. గ్రేటర్‌ వ్యాప్తంగా 40-50 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే.. నాలుగోవంతు ఖర్చుతోనే తమ వద్ద సేవలందిస్తామని నిమ్స్‌ వైద్యులు పేర్కొంటున్నారు.

మద్యపానం, సిగరెట్ స్మోకింగ్‌ వల్ల గురక
మద్యం సేవించడం, సిగరెట్‌ స్మోకింగ్‌, ట్రాంక్విలైజర్‌ ఔషధాల వాడకంతో కూడా గురక వస్తుంది. ఇది ఒక కారణం మాత్రమే. అధిక బరువు కారణంగా కూర గొంతులోని కణజాలం తగ్గుతుంది. దీని వల్ల గురక పెరుగుతుంది. సైనస్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కూడా గురక వస్తుంది. వాస్తవంగా మరెన్నో అంశాలు ఉన్నాయి. ప్రధాన కార‌ణంగా మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పరిశోధకులు నిర్ధారించారు.

గురక ఎందుకు వస్తుంది?
నిద్రపోతున్నప్పడు ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడిన సమయంలో గురక వస్తుంది. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండటం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడి గురకకు దారితీస్తుంది.

Recent

- Advertisment -spot_img