Spice Express : అత్యవసర వస్తువుల డ్రోన్ డెలివరీ సర్వీసులలోకి స్పైస్‌జెట్
Spice Express : ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. మారుమూల ప్రాంతాలకు వైద్య, ఔషధ, అత్యవసర వస్తువులు సరఫరా చేయడానికి డ్రోన్ డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించింది.
ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నుంచి ట్రయల్స్ నిర్వహించడానికి గతేడాది మే నెలలోనే స్పైస్‌జెట్‌కు ధృవీకరణ పత్రం అందింది.
నిరంతరాయంగా సప్లయ్ చైన్ నిర్మించడం ద్వారా తన లాజిస్టిక్ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించాలని భావిస్తున్నది.
ప్రారంభంలో 0-5 కిలోలు, 5-10 కిలోలు, 10-25 కిలోల సామగ్రిని డ్రోన్లలో సరఫరా చేయనున్నది.
మైల్ దూరంలోపే ప్రారంభంలో సేవలందించాలని తలపెట్టింది.
మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అత్యవసర వస్తువులు తదితరులను సరఫరా చేయడంపై స్పైస్‌జెట్ అనుబంధ రవాణా సంస్థ స్పైస్ ఎక్స్‌ప్రెస్ దృష్టి సారించనున్నది.
ఈ సేవలందించడానికి 50కి పైగా హై ఎండ్ డ్రోన్ల కోసం థ్రోటిల్ ఎయిరోస్పేస్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
ప్రారంభంలో 10 జిల్లాల్లోని 150 ప్రాంతాలకు పైగా డ్రోన్ బిజినెస్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
కుమ్మక్కు రాజకీయాలు చేస్తే ఊరుకోను