Spirit Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి తాజాగా కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమా గురించి భారీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందని, కేవలం 7 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమా పాన్ ఆసియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది, ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా గత చిత్రాలైన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, మరియు ‘యానిమల్’ వంటి సినిమాలతో హీరోలకు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ‘స్పిరిట్’ సినిమాలో కూడా ప్రభాస్‌ను ఒక యాంగ్రీ యంగ్ కాప్‌గా చూపించనున్నారు.