Homeహైదరాబాద్latest NewsSpirit movie : "స్పిరిట్" మూవీ సాలిడ్ అప్డేట్.. ఒక కాదు రెండు.. బాక్సాఫీస్ షేక్...

Spirit movie : “స్పిరిట్” మూవీ సాలిడ్ అప్డేట్.. ఒక కాదు రెండు.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!!

Spirit movie : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “స్పిరిట్” మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని, ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, మరోవైపు రౌడీ మాఫియా డాన్‌గా అభిమానులను అలరించనున్నాడని తాజా సమాచారం.

ఇప్పటివరకు ప్రభాస్ “బాహుబలి”, “సలార్” వంటి సినిమాలతో తన యాక్షన్ , హీరోయిజం ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటాడు. ఇప్పుడు “స్పిరిట్”లో డ్యూయల్ రోల్‌తో మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఒక పాత్రలో నిజాయతీ, ధైర్యం, బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే, మరో పాత్రలో మాఫియా డాన్‌గా చూపించే రౌడీయిజంతో అభిమానులను థ్రిల్ చేయనున్నాడు. సందీప్ రెడ్డి వంగా మార్క్‌లో ఈ రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

“అర్జున్ రెడ్డి”, “యానిమల్” వంటి సినిమాలతో ఇంటెన్స్ కథలు, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందీప్ రెడ్డి వంగా, “స్పిరిట్”తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్‌ డ్యూయల్ రోల్‌ను తనదైన శైలిలో రూపొందించి, యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామాను అద్భుతంగా మేళవించనున్నాడు. ఈ సినిమా 8 భాషల్లో విడుదల కానుందని, బడ్జెట్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ 2025 జులై లో ప్రారంభం కానుంది.

Recent

- Advertisment -spot_img