పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కొరియాన్ స్టార్ డాన్ లీ విల్లన్ గా నటిస్తున్నాడు అని టాక్ నడుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో డాన్ లీ అంతర్జాతీయ మాఫియా డాన్‌గా కనిపిస్తాడు మరియు ప్రభాస్ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. అంటే కొత్త ట్రెండ్ న్యూస్ గా స్పిరిట్ స్టోరీ గ్లోబల్ రేంజ్ లో ఉంటుంది అని టాక్ నడస్తుంది.