Homeఅంతర్జాతీయం#SputnikV #Corona #Covid19 #Vaccine : స్పుత్నిక్ వీ తో కొత్త వేరియంట్లకూ చెక్‌

#SputnikV #Corona #Covid19 #Vaccine : స్పుత్నిక్ వీ తో కొత్త వేరియంట్లకూ చెక్‌

స్పుత్నిక్‌-వి టీకా డెల్టాతో పాటు ఇతర కరోనా వేరియంట్లపైనా ప్రభావవంతంగా పనిచేస్తుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ ప్రకటించింది.

వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారి రక్తనమూనాలను సేకరించి విశ్లేషించగా ఈవిషయం వెల్లడైనట్లు తెలిపింది.

ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్‌, మాస్కోలో ఇటీవల గుర్తించిన వేరియంట్లకు వ్యతిరేకంగా ‘స్పుత్నిక్‌-వి’ రోగ నిరోధక ప్రతిస్పందనను కలిగించగలదని గుర్తించినట్లు పేర్కొంది.

సెప్టెంబరు నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో స్పుత్నిక్‌-వి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించింది.

ఏటా 30 కోట్లకు పైగా డోసులను ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తుందని తెలిపింది.

టీకా తయారీకి అవసరమైన కణాలు, వెక్టర్‌ శాంపిళ్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే ‘సీరమ్‌’కు బదలాయించామని స్పష్టంచేసింది.

ఈవిషయాన్ని సీరం సీఈవో అదర్‌ పూనావాలా ధ్రువీకరించారు.

సెప్టెంబరు నుంచి స్పుత్నిక్‌-వి ట్రయల్‌ బ్యాచ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు.

స్పుత్నిక్‌-విను దేశంలోని 50కిపైగా నగరాలు, పట్టణాల్లో సోమవారం విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

హైదరాబాద్‌తో మొదలుపెట్టిన టీకా విడుదల ప్రక్రియను దేశంలోని ఇతర ప్రధాన నగరాలకూ విజయవంతంగా విస్తరించినట్లు తెలిపింది.

కొద్ది వారాల్లో టీకాను వాణిజ్యపరంగా విడుదలచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.

Recent

- Advertisment -spot_img