Homeహైదరాబాద్latest Newsశ్రీలీల.. ఇక చాలు : Sree Leela

శ్రీలీల.. ఇక చాలు : Sree Leela

గత ఏడాది శ్రీలీల క్యాలెండర్ లో కొంచెం ఖాళీ కూడా లేదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ గత ఏడాది అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. యంగ్, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. కానీ వాటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. 2023లో శ్రీలీల నటించిన ‘భగవంత్ కేసరి’ తప్పితే మరే సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఈ సంక్రాంతికి మహేష్ బాబుతో కలిసి ‘గుంటూరు కారం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను దాదాపు పూర్తిచేసిన శ్రీలీల చేతిలో ప్రెజెంట్ ఒక్క సినిమా కూడా లేదు. అప్పుడెప్పుడో ఒప్పుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పది రోజుల తర్వాత ఆగిపోయింది. ఈ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవ్వాలంటే కనీసం 6 నెలలైనా పడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో షూటింగ్ కష్టమే. మరి ఈ గ్యాప్ లో మరో సినిమా ఆఫర్ ఏదైనా వస్తే చెప్పలేం. మార్చిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ ప్రాజెక్టు షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సినిమాలో ఫస్ట్ శ్రీలీలనే హీరోయిన్గా అనుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్టు నుండి శ్రీలీలా తప్పుకుంటే ఆమె ప్లేస్ లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రిని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే ఈ ఏడాది శ్రీలీల కొంతకాలం ఖాళీగానే ఉండే అవకాశం ఉంది. 2023లో ఒక్కరోజు కూడా ఖాళీగా లేని ఈ ముద్దుగుమ్మ 2024 లో మాత్రం రిలాక్సింగ్ మోడ్లో ఉండే పరిస్థితి నెలకొంది. ఈ ఖాళీ టైమ్ లో అమ్మడు భవిష్యత్ పై ఒకసారి ప్రణాళిక వేసుకంటే బాగుంటుందేమో. కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ కథలు రొటీన్ క్యారెక్టర్స్ పడకుండా అడుగులు వేస్తే సరి.

Recent

- Advertisment -spot_img