Homeహైదరాబాద్latest Newsతిలక్ వర్మ పై కన్నేసిన ఎస్​ఆర్​హెచ్​.. అదే జరిగితే ఈ సారి హోమ్ టీం ఆడడం...

తిలక్ వర్మ పై కన్నేసిన ఎస్​ఆర్​హెచ్​.. అదే జరిగితే ఈ సారి హోమ్ టీం ఆడడం పక్కానా?

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం నిర్వహించనున్నందున అన్ని ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బీసీసీఐఐ కూడా వేలం నిర్వహణపై దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కానీ బీసీసీఐ మాత్రం ఇంకా రిటెన్షన్ విధానాన్ని ప్రకటించలేదు. మునుపటి మెగా వేలం నిబంధనల ప్రకారం.. ప్రతి జట్టు గరిష్టంగా నలుగురి నుండి ఐదుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఈ క్రమంలో వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్లతోపాటు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాపై ఫ్రాంచైజీలన్నీ దృష్టి సారించాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలక్ వర్మ తన అద్భుత ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ముంబై ఇండియన్స్ మెగా వేలం నిబంధనల ప్రకారం తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసే పరిస్థితి లేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కొనసాగించే అవకాశం జట్టుకు ఉంది. దాంతో తిలక్ వర్మ వేలం బరిలోకి దిగాల్సి వచ్చింది. బీసీసీఐ ఫ్రాంచైజీలకు RTM (రైట్ టు మ్యాచ్) అవకాశం కల్పిస్తే, అది ముంబై తిలక్ వర్మ కోసం ఉపయోగించే అవకాశం ఉంది. అది సాధ్యం కాకపోతే తిలక్ వర్మను కొనుగోలు చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది. పూర్తిగా విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడిన హైదరాబాద్ జట్టు.. ఆ సమస్యను అధిగమించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img