SRH vs GT : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.. టాస్ ఓడిపోయిన సన్రైజర్స్ బ్యాటింగ్ దిగింది. వరుసగా మూడు ఓటముల తర్వాత, పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఈ జట్టు తమ ఫామ్ ను తిరిగి పొందాలని చూస్తోంది. మరి ఈరోజు మ్యాచ్ గెలుస్తుందో లేదో చూడాలి.