ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ముఖ్యమైన మ్యాచ్ ఆడనుంది. లక్నో సూపర్ జెయింట్ అలంటి తన సమవుజ్జీగా జట్టుతో తలపడనుంది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ గడ్డ పై ఈ ఐపీఎల్ 2024 సీజన్‌లో 1,000 సిక్సులు మార్క్‌ను దాటడాన్ని నేడు ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 56 మ్యాచ్‌లల్లో 997 సిక్సర్లు రికార్డయ్యాయి. ఇంకో మూడు సిక్సులు పడితే.. 1,000 మార్క్‌ను అందుకుంటుంది. గతంలో 2023 ఐపీఎల్ సీజన్‌లో అతను 1,124 సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్‌లో కేవలం 56 మ్యాచ్‌ల్లో 997 సిక్సర్లు కొట్టారు. ఇంకా 15 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్ ముగిసే సమయానికి 1,124 సిక్సర్లు మార్కు క్రాస్ చేసే అవకాశం ఉంది.