SRH vs LSG : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ దిగింది. సన్‌రైజర్స్, లక్నో ఇప్పటి వరకు నాలుగు సార్లు తలపడ్డాయి. లక్నో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, సన్‌రైజర్స్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్‌వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్ పటేల్, మహ్మద్ షమి ఉన్నారు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టులో ఐదెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్, ప్రిన్స్ యాదవ్ ఉన్నారు.