SRH vs LSG : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో లక్నో మొదట బ్యాటింగ్ చేయనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో లక్నో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడితే.. లక్నో ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ కానుంది.
సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కే ఉన్నారు.