Homeహైదరాబాద్latest NewsSRH vs MI : సన్‌రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్.. 300 లోడింగ్..!!

SRH vs MI : సన్‌రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్.. 300 లోడింగ్..!!

SRH vs MI : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సొంతగడ్డపై విజయం సాధించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 300 స్కోర్ ను సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ లో కొడుతుందో లేదో చూడాలి.
సన్‌రైజర్స్ జట్టులో కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, రాహుల్ చహర్ ఉన్నారు.
ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, బౌల్ట్, బుమ్రా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img