SRH vs PBKS: సీజన్ తొలి మ్యాచులో గెలిచి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసిన SRH తర్వాత వరుసగా 4 మ్యాచులు ఓడిపోయి వారి ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం 2 పాయింట్లతో టేబుల్‌లో చిట్టచివరన నిలిచింది. మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. దీంతో ఇవాళ పంజాబ్‌పై తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే తర్వాతి 8 మ్యాచుల్లో 7 గెలవాలి. అలా గెలవకుంటే SRH ఇంటిబాట పట్టడం తప్ప, మరో దారి లేదు.
SRH ప్లేయింగ్ XI అంచనా – ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నీతీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికెట్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ;
PBKS ప్లేయింగ్ XI అంచనా – ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వఢేరా, షషాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, యుజవేంద్ర చాహల్, ఆర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్.