Homeఫ్లాష్ ఫ్లాష్మూడో రోజుకు చేరుకున్న శ్రీచైతన్య ఫ్యాకల్టీ ఆందోళన.. లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నంతో ఉద్రిక్తత

మూడో రోజుకు చేరుకున్న శ్రీచైతన్య ఫ్యాకల్టీ ఆందోళన.. లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నంతో ఉద్రిక్తత

తమ బకాయి జీతాలు చెల్లించాలని… విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ చైతన్యపురిలోని శ్రీ చైతన్య కళాశాల పాకాల ప్లాజా బ్రాంచ్‌ లెక్చరర్ల ఆందోళన మూడో రోజుకు చేరుకుంది.

దాదాపు 45 మంది లెక్చరర్లు చేస్తున్న ధర్నాకు ప్రైవేట్‌ లెక్చరర్ల సంఘంతో పాటు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కూడా తమకు లాక్‌డౌన్‌లో చెల్లించాల్సిన సగం జీతం చెల్లించకపోవటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

జీతాలు లేక కుటుంబ సభ్యులను పస్తులుంచాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు.

లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నం… 

జువాలజీ లెక్చరర్‌ డాక్టర్‌ హరినాథ్‌ బలవన్మరణానికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తోటి అధ్యాపకులు అతడిని అడ్డుకున్నారు.

25 సంవత్సరాలు అధ్యాపకుడిగా సేవలు అందించిన తనకు జీతాలు చెల్లించడం లేదన్నారు. భార్య, పిల్లలకు ఒక్కపూట కడుపునిండా తిండిపెట్టలేని తనకు ఆత్మహత్యే శరణ్యమని హరినాథ్‌ విలపించడం అక్కడ అందరినీ కంట తడి పెట్టించింది.

సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హరినాథ్‌ను స్టేషన్‌కు తరలించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img