Sri Chaitanya College : దేశవ్యాప్తంగా ప్రస్తుతం శ్రీ చైతన్య కళాశాలల్లో (Sri Chaitanya College) ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు మరియు చెన్నైలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుండి నగదు రూపంలో రుసుములు వసూలు చేసి పన్నులు ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఐదు రోజులపాటు శ్రీ చైతన్య కాలేజీలో సోదాలు జరిగాయి. శ్రీ చైతన్య కాలేజీ దాదాపు 230 కోట్ల రూపాయల టాక్స్ ఎగొట్టినట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు చేస్తున్నట్లు గుర్తించారు.