Homeహైదరాబాద్latest Newsసుద్ధ ముక్క మీద శ్రీమురళీకృష్ణుడి రూపం

సుద్ధ ముక్క మీద శ్రీమురళీకృష్ణుడి రూపం

ఇదే నిజం,గొల్లపల్లి : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని సుద్ధముక్క మీద శ్రీకృష్ణుడి రూపాన్ని చెక్కాడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు శిల్పి సైకత శిల్పి లీఫ్ ఆర్టిస్ట్ ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారి శ్రీకృష్ణుని మీద అపారమైనటువంటి భక్తి భావాన్ని చాటుతూ 35 నిమిషాల్లోనే ఈ శిల్పాన్ని చెక్కినట్లు తెలిపారు.సమస్త మానవాళికి గీతోపదేశం చేసి అందరూ సమానంగా ఉండాలని మనిషి మనుగడకు ఒక దిశా నిర్దేశం చేసిన మహోత్తర మూర్తి శ్రీకృష్ణుడని భగవద్గీత ద్వారా మనిషి జీవనశైలి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు తెలిపినటువంటి దార్శనికుడిగా శ్రీకృష్ణ భగవానుడు మహా పురుషుడిగా పేర్కొన్నారు.

ప్రేమ వాత్సల్యం ధర్మం గురించి,సమస్తాన్ని మనకు తెలిపిన మహా రూపమే శ్రీకృష్ణుడని శ్రీకృష్ణ జన్మాష్టమి సమస్త మానవాళి జరుపుకోవాలని తెలిపారు.చోలేశ్వర చారి గతంలో 2000 పైగా సుద్ధముక్కల పైన శిల్పాలు చెక్కి ఉత్తమ కళాకారుడిగా ప్రభుత్వం చే అవార్డు పొందారు,తన యొక్క ప్రతిభతో ఆకుల మీద మరియు సైకత శిల్పాలు పాల మీద ఇతర వస్తువుల మీద వెయ్యికి పైగా చిత్రాలను చేసి మరియు వృత్తిపరంగా వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్టి టీచర్ గా పని చేస్తూ విద్యార్థులకు ఆదర్శనీయంగా ఉండడం ద్వారా జనవరి 26న సిరిసిల్ల కలెక్టర్ గారిచే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును పొందారు. పండగ సందర్భంగా శ్రీకృష్ణుని భక్తులు,రాఘవపట్నం గ్రామస్తులు,కుల సంఘ నాయకులు,రాజకీయ ప్రముఖులు,శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్,కొల్లి రమావతి మరియు సాహితీ మిత్రులు,తెరవే సభ్యులు అందరూ అభినందించారు.

spot_img

Recent

- Advertisment -spot_img