టాలీవుడ్‌లోకి ‘పెళ్లి సందడి’ సినిమాతో శ్రీలీల అడుగుపెట్టింది. అయితే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కనడ బ్యూటీ.. ఆ తరువాత రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రీలీలకి పెద్ద అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరితోనూ నటిస్తుంది. అయితే సినిమాలు చేస్తుంది కానీ.. ‘ధమాకా’ సినిమా తప్ప ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫొటోలతో ఎపుడు ట్రెండ్ లో ఉంటుంది. తాజాగా పింక్ శారీలో శ్రీలీల హాట్ లుక్స్‌తో కుర్రాళ్లని కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.