టాలీవుడ్‌లోకి ‘పెళ్లి సందడి’ సినిమాతో అడుగుపెట్టిన శ్రీలీల.. ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తరువాత పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తు.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవలే ”పుష్ప 2” సినిమాలో ‘కిస్సిక్’ పాటతో శ్రీలీల మరింత పాపులర్ అయ్యింది. ఈ ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్ కి చేరుకుంది. దాంతో పాటు బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీకి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీంతో హీరోయిన్ శ్రీలీల కెమెరాకు చిక్కింది. అయితే వీరిద్దరూ ఒకే రెస్టారెంట్‌లో కలిశారు. దాంతో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకుతో కలిసి శ్రీలీల కెమెరాలకు పోజులిచ్చింది. సైఫ్ కొడుకుతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజతో ‘మాస్ జాతర’ అనే సినిమాలు చేస్తోంది.