Homeహైదరాబాద్latest Newsప్రేమలో పడ్డ శ్రీముఖి.. త్వరలోనే పెళ్లి..?

ప్రేమలో పడ్డ శ్రీముఖి.. త్వరలోనే పెళ్లి..?

యాంకర్ శ్రీముఖి.. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. బుల్లితెర మీదన వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ విన్నర్ అవుతుందని భావించినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గత కొంతకాలంగా శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ మధ్య యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే అలాంటిది ఏమీ లేదని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ప్రదీప్, శ్రీముఖి ఇద్దరూ దీనిపై వివరణ ఇచ్చారు.

అయితే తాజాగా మరోసారి శ్రీముఖి ప్రేమ వార్త వైరల్ అవుతుంది.. శ్రీముఖి కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే శ్రీముఖి త్వరలో ఓ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీముఖి టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. శ్రీముఖి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ప్రేమించిన వ్యక్తితోనే శ్రీముఖి వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో యంగ్ హీరోని శ్రీముఖి పెళ్లి చేసుకోనుందని సమాచారం. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img