ఇదే నిజం జనవరి 01 బెల్లంపల్లి : సమగ్ర శిక్షా అభియాన్ కేజిబివి పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారి సమస్యలు వెంటనే పరిష్కరించి, వారి సమ్మెను విరమింప చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. వారు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏమాజి మాట్లాడుతూ ఉద్యోగుల సమ్మె 23 రోజులు దాటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిoచటం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు. కొన్ని శాఖల కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులర్ చేసి వీరిని మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులను మోసం చేస్తే వారిని ఇంట్లో కూర్చో బెట్టారని, రేవంత్ రెడ్డికి అదే గతి పడ్తుందని హెచ్చరించారు. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించి, సమ్మెను విరమింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పూల మొక్క ఇచ్చి మద్దతు గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా పూల మొక్క అందజేసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో సమస్యలు పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూదన్ రావు, బిజెపి నాయకులు లింగoపల్లి విజయ్ కుమార్, ఉద్యోగుల సంఘం నాయకులు రాజన్న, సుమన చైతన్య తదితరులు పాల్గొన్నారు.