Homeహైదరాబాద్latest News‘'SSMB 29'’ మూవీ క్రేజీ అప్డేట్..! సినిమా సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడో తెలుసా..?

‘’SSMB 29’’ మూవీ క్రేజీ అప్డేట్..! సినిమా సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని మహేష్ బాబు అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి మహేష్ బాబు పక్కన బ్రిటిష్ క్యూటీ నవోమి స్కాట్‌ని హీరోయినిగా ఎంపిక చేసారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన సాలిడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారం తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి లొకేషన్స్ మరియు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నందున, షూటింగ్ ఆలస్యం అవుతోంది మరియు ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img