Homeహైదరాబాద్latest News‘SSMB29’ క్రేజీ అప్డేట్.. ఏకంగా బ్రిటీష్ భామని రంగంలోకి దింపుతున్న రాజమౌళి ..?

‘SSMB29’ క్రేజీ అప్డేట్.. ఏకంగా బ్రిటీష్ భామని రంగంలోకి దింపుతున్న రాజమౌళి ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి మహేష్ బాబు పక్కన బ్రిటిష్ క్యూటీ నవోమి స్కాట్‌ని హీరోయినిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నవోమి స్కాట్‌తో సినిమాకు సంబంధించిన చర్చలు ముగిశాయని.. అందుకే రాజమౌళి తనయుడు కార్తికేయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఏమి అధికారికంగా ప్రకటించలేదు.

Recent

- Advertisment -spot_img