Homeహైదరాబాద్latest NewsSSMB29 : హాలిడేస్ కి గుడ్‌బై.. ఇక మొదలెడదామా..!!

SSMB29 : హాలిడేస్ కి గుడ్‌బై.. ఇక మొదలెడదామా..!!

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ”SSMB29” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ కు జక్కన్న చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ హాలిడేస్ కి విదేశాలు వెళ్ళాడు. మరోవైపు రాజమౌళి కూడా జపాన్ లో ”RRR” సినిమా డాక్యూమెంటరీ ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా మహేష్ బాబు తన వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. అలాగే ”RRR” సినిమా ప్రొమోషన్స్ పూర్తి కావడంతో జక్కన్న మహేష్ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా 1500 కోట్లు భారీ బుడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.SSMB29 maheshbabu ఇదేనిజం SSMB29 : హాలిడేస్ కి గుడ్‌బై.. ఇక మొదలెడదామా..!!

Recent

- Advertisment -spot_img