SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ”SSMB29” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ డ్రామా కావడంతో ప్రపంచం అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిస్సా లోని కోరాపుట్ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ లో మహేష్ బాబు, పృథ్వీ రాజ్ మధ్య కీలక సన్నివేశాలను రాజమౌళి తీస్తున్నాడు. అయితే జక్కన ఈ సినిమా విషయంలో చేతులు ఎత్తేసాడు. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసాడు అని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఒక వీడియో లీక్ అవడంతో రాజమౌళికి భారీ షాక్ తగిలింది. దాదాపు 1000 నుండి 1500 కోట్లుతో తీస్తున్న ఈ సినిమా సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో రాజమౌళి ఆలోచనలో పడ్డాడు. దీంతో రాజమౌళి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఈ సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో చేయకూడదు అని కేవలం ఇండోర్ లో భారీ సెట్స్ వేసి షూటింగ్ చేయాలనీ ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం ఒడిస్సా లో చేస్తున్న షూటింగ్ అవగానే ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని భారీ సెట్స్ వేసి ఇకపై మిగతా సినిమా షూటింగ్ అంత అక్కడే తీయాలని జక్కన ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ లీక్ కాకుండా రాజమౌళి ఈ మేరకు జాగ్రత్తలు తీసుకున్నాడు.