పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం యావత్ దేశ సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇండియాలోనే 1000-1500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. రాజమౌళి, మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ”SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టారు. ఇంతకుముందు మనం చూడని మహేష్‌ని సినిమాలో చూపించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ టాక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి టి-సిరీస్ భారీ స్థాయిలో ఫైనాన్స్ చేయనుందని సమాచారం. భూషణ్ కుమార్, రాజమౌళి మధ్య చర్చలు జరుగుతున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ మార్కెట్ కోసం హిందీ హక్కులను టీ-సిరీస్ కు అప్పగించే యోచనలో డైరెక్టర్ రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2025 లో రెగ్యులర్ షూటింగ్ మొదలపెట్టనున్నారు.