Homeహైదరాబాద్latest News''SSMB29'' మూవీ ముహూర్తం షాట్.. అందుకేనా..? రాజమౌళి ప్లాన్ ఏంటి..?

”SSMB29” మూవీ ముహూర్తం షాట్.. అందుకేనా..? రాజమౌళి ప్లాన్ ఏంటి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నేడు ఈ సినిమా షూటింగ్ సంబంధించి ముహూర్తం షాట్ తో లంచ్ అయింది. ఈ షూటింగ్ విషయంలో రాజమౌళి టీమ్ సీక్రెట్ మెయిటైన్ చేస్తుంది. అయితే ఈ ముహూర్తం షాట్ తీయడానికి అసలు కారణం గురువారం శ్రవణా నక్షత్రం ముహూర్తం మంచిది కావడంతో ఇలా ప్లాన్ చేసారు అని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను రాజమౌళి ఆఫ్రికా తో పాటు పలు దేశాల్లో జరగబోతుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకులకు ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి పార్ట్ ని 2027లో.. రెండో పార్టును 2028లో రిలీజ్ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img