SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ”SSMB29” అనే సినిమాలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అధిస్తున ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేసారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ డేట్ ను రాజమౌళి ఫిక్స్ చేసారు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాని 2027లో మార్చి 25న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. అయితే 2022లో అదే తేదీన విడుదలైన ”RRR” సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ డేట్ రాజమౌళి కి సెంటిమెంట్ కావడంతో మహేష్ సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేయాలనీ రాజమౌళి చూస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాని దాదాపు 1500 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.