SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ”SSMB29” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత చిత్రబృందం మొత్తం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. అయితే, తాజా నివేదికల ప్రకారం, బృందం మరోసారి ఒడిశాలో తమ షూటింగ్ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి సినిమా షూటింగ్ భువనేశ్వర్ శివార్లలో ఉండవచ్చు అని సమాచారం. ఈ సినిమా 1500 కోట్లు భారీ బుడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.