SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ”SSMB29” అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హీరోయినిగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. తాజాగా నుండి పూనకాలు తెప్పించే అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమాని రాజమౌళి మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ వార్తతో మహేష్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లోషూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.