SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ”SSMB29” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిస్సా లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓడిశాలోని కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ జరుగనుంది. రాజమౌళి సినిమా షూటింగ్ షెడ్యూల్ నుండి విరామం తీసుకుని తలమాలి సమీపంలోని టంకుబేడ గ్రామంలోని ఒక మైదానంలో స్థానిక యువకులతో వాలీబాల్ ఆట ఆడారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇది అంత చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. రాజమౌళి ఇలా ఎంజాయ్ చేస్తూ వారికి సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవలే సినిమా నుండి ఒక వీడియో కూడా లీక్ అవడంతో మహేష్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. రాజమౌళి ఎంజాయ్ చేస్తుంటే మహేష్ సినిమా ఇంకా లేట్ అయిపోతుందని అభిమానులు అంటున్నారు.