SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ”SSMB29” అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ డ్రామా కావడంతో ప్రపంచం అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. వెండితెరపై ఈ సినిమాని కన్ని విని ఎరుగని స్థాయిలో జక్కన్న తీస్తున్నాడు. ఈ సినిమాకి ఏకంగా 1000 నుండి 1500 కోట్లుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిస్సా లోని కోరాపుట్ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ లో మహేష్ బాబు, పృథ్వీ రాజ్ మధ్య కీలక సన్నివేశాలను జక్కన్న తీస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ప్రియాంక చోప్రా కూడా అడుగుపెట్టింది.
తాజాగా ఈ సినిమా గురించి ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో ఒడిస్సా లోని మల్కాన్‌గిరిలో ”పుష్ప-2” సినిమా షూటింగ్ జరిగింది అని ఆమె తెలిపారు. అలాగే ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోంది అని ఆమె అన్నారు. ఇది ఒడిశాలో సినిమా షూటింగ్ కోసం సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌ల సంపద ఉందని రుజువు చేస్తుంది అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఒడిశా పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఇది ప్రధాన షూటింగ్ గమ్యస్థానంగా మారుతుంది అని వెల్లడించారు. ఒడిశా సామర్థ్యాన్ని అన్వేషించడానికి అన్ని చలనచిత్ర పరిశ్రమలను మేము స్వాగతిస్తున్నాము మరియు పూర్తి మద్దతు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను హామీ ఇస్తున్నాము అని డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా తెలిపారు.