Homeసినిమారజనీ–లోకేశ్ మూవీలో ఆ స్టార్​ హీరో?

రజనీ–లోకేశ్ మూవీలో ఆ స్టార్​ హీరో?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి.. ఆయనకు కమ్​ బ్యాక్​ మూవీగా నిలిచింది. అయితే, రజనీకాంత్ తన తర్వాత సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్​తో చేస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘తలైవర్ 171’గా ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్​పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోస్​లో ఒకడైన శివకార్తికేయన్ నటిస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. క్యాస్టింగ్ పరంగా అప్పుడే ఈ సినిమా మరింత గ్రాండ్​గా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. సన్​ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img